Tuesday, 24 June 2014

పత్రికా  ప్రకటన తేదీ 24.06.2014
తపాలాశాఖలో సాంకేతిక  పరిజ్ఞానముతో చోటుచేసుకున్న పరిణామక్రమములో చంద్రగిరి ప్రధాన తపాలా కార్యాలయములోని  చిన్నమొత్తాల  పొదుపు (SB) ఖాతాలన్నింటినీ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్(CBS) అనే ఆన్ లైన్ (ONLINE) బ్యాంకింగ్ కు తగిన విధముగా మార్పులు చేయుటకు సన్నద్ద మగుచున్నది.
క్రమములో SB , RD , MIS , TD , SCSS , PPF , NSS , అన్ని విధముల ఖాతాలను ఆన్ లైన్ (ONLINE) బ్యాంకింగ్ తో అనుసంధానముచేసి తపాలాశాఖ ప్రజలకు సేవలందించుక్రమములో ప్రజల సహకారము కోరడమైనది . తపాలా శాఖ ఖాతాదారులైన MIS , TD , RD  మరియూ SCSS ఖాతాదారులు తమ యొక్క తపాలా కార్యాలయములో ఒక సేవింగ్స్ బ్యాంకు ఖాతాను తెరుచుకొనవలసినది . మీ MIS , TD , SCSS  ఖాతాల యొక్క వడ్డీని నెలసారి , త్రైమాసిక మరియూ సంవత్సర వడ్డీని మీరు తెరిచిన మీ (SB ) సేవింగ్స్ ఖాతాలో జమచేయబడును . మీకు ఇప్పటికే ఖాతా (SB account ) ఉన్న యెడల మీయొక్క తపాలా కార్యాలయములో మీ MIS ఖాతా వివరములు మరియూ SB ఖాతా వివరములు తెలియజేయవలయును
            చంద్రగిరి ప్రధాన తపాలా కార్యాలయములోగల  చిన్నమొత్తాల  పొదుపు (SB) ఖాతా లన్నింటినీ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్(CBS) అనే ఆన్ లైన్ (ONLINE) బ్యాంకింగ్ కు 26. 06. 2014 తేదీ నుండి ప్రారంభము కానున్న సందర్భముగా, మా తపాల శాఖ ఖాతాదారులకు చేయు విన్నపము ఏమనగా , చంద్రగిరి ప్రధాన తపాలా కార్యాలయము నందు 25. 06. 2014 తేదీన మరియు 27.06.2014 తేదీన  ఏలాంటి సేవింగ్స్ బ్యాంకు వ్యాపార కార్యక్రమములు జరుపబడవు . తిరిగి సేవింగ్స్ బ్యాంక్ లావాదేవీలు 28.06.2014 తేది (శనివారం ) నుండి యధాతధముగా జరుగును . కావున , ఖాతాదారులందరూ సహకరించ ప్రార్థన !                                                                                                             
  ఇట్లు ,
                                                                                                                     (T A .V. శర్మ )
 పోస్టల్ సూపరింటెండెంట్ ,
   తిరుపతి డివిజన్ , తిరుపతి -517501

No comments:

Post a Comment