Friday, 31 October 2014

పత్రికా ప్రకటన / 31.10.2014.

తిరుపతి తపాల డివిజన్ లో విజిలెన్స్ అవేర్నెస్ వీక్  అక్టోబర్ 27 తేది నుండి నవంబర్ 1 తేది వరకు జరపబడుతున్నది వారోత్సవాల సందర్భంగా రోజున తపాలా సూపరింటెండెంట్ కార్యాలయంలో ACB DSP  శ్రీ శంకర్ రెడ్డి గారు, ACB విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శ్రీ రామ్ కిషోర్ గార్లను అహ్వనించి ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. ACB DSP శ్రీ శంకర్ రెడ్డి గారు తపాలా  ఉద్యోగులందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ   అవినీతిని నిరోధించడానికి, ఉద్యోగ నిర్వహణలో మరియు వ్యక్తిగత వ్యవహారములలో ఎలాంటి మెళకువలు పాటించాలో వివరించారు.  ACB విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శ్రీ రామ్ కిషోర్ గారు కూడా తమ విలువైన సూచనలు ఉద్యోగులకు అందించారు సమావేశానికి పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీ T.A.V. శర్మ గారు అధ్యక్షత వహించి తపాలా ఉద్యోగులు అందరు ఉద్యోగ రిత్యా మరియు వ్యక్తిగత రీత్యా పాటించాల్సిన జాగ్రత్తలను సూచించారుఅంతేగాక రోజు జాతీయ ఐకమత్య దినోత్సవం సందర్భంగా ప్రమాణాన్ని స్వీకరించడం జరిగింది సమావేశానికి పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీ రామ శంకర్, పబ్లిక్ రిలేషన్స్ ఇన్స్పెక్టర్స్ శ్రీమతి సుగుణమ్మ, శ్రీ చెంగాల్రాయులు, శ్రీ బ్రహ్మానంద స్వామి మరియు  తపాలా ఉద్యోగులందరూ పాల్గొని సభను జయప్రదం గావించారు.

SNAPS OF MEETING:








No comments:

Post a Comment