Monday, 28 December 2015

ప్రయత్నం

పరిస్తితులు అనుకూలంగా లేనప్పుడు ....
నడిచే దారి ముళ్ళమయమైనపుడు .....
చేతిలో కాణీ లేనప్పుడు ...
అప్పులు పర్వతాల్లా పెరిగినప్పుడు ....
పెదవులపై నవ్వు మాయమైనప్పుడు ....
బ్రతుకు నిట్టూ ర్పుల  మయమైనప్పుడు ....
కాలం నిన్ను అణిచి వేస్తున్నప్పుడు ...
వెతికినా విశ్రాంతి కానరానప్పుడు ....

ఆపరిస్థితులలోనే - నేస్తం ....
ప్రయత్నాన్ని ఆపేయకు ....
విజయం అడ్రస్  - తలుపుల వెనుకనే .....
ఓపికతో  వెళితే   - గమ్యం దొరుకుతుంది....
పట్టుదలతో శ్రమిస్తే  - విజయం నీ దవుతుంది ....
ఎదిరించి నిలిచినపుడే -
కాలం - తలవొంచుతుంది .....
అనుకూలమై ఒదుగుతుంది .....
పరిణితితో మనసు ఎదుగుతుంది .....


--తీర్థాల

No comments:

Post a Comment