v మొదట చేతి వేళ్ళను
నీళ్ళ తో సుబ్రంగా కడిగి, పొడి గుడ్డ తో
వాటిని తుడవవలెను. చేతి వెళ్లకు, ఏటువంటి దుమ్ము మరియు తడి లేకుండా సుబ్రంగా ఉంచవలెను.
v బయోమెట్రిక్ పరికరం పై వేళ్ళు పెట్టునప్పుడు, వేలు నిటారుగా
మరియు మద్యస్తమైన ఫోర్స్ ఉపయోగించవలెను.
v బయోమెట్రిక్ పరికరం లోని
సెన్సార్ అనగా వేలు పెట్టు ప్రదేశం మొత్తం, కవర్ అయ్యే
విధంగా మీ వేలును పెట్టవలెను.
v సెన్సార్ పై పెట్టిన మీ వేలును బీప్ అని శబ్ధం రాగానే
తీసేయవలెను.
v ప్రతి ఒక్కరూ బిఎఫ్‌డి చేయించుకోవలెను. ఒక్కసారి
చేయించినచో, మీరు పేమెంట్ కు వెళ్లినప్పుడు, మీ చేతిలోని ఏ
వేలు పెట్టవలెనో, పరికరమే చూపుతుంది.
v బి.పి.ఏం. ప్రతి లబ్ది దారునికి బి.ఎఫ్.డి. చేయవలెను.
బి.ఎఫ్.డి. ఫెయిల్ అయినచో, ఈ క్రింద తెలుపబడిన విధంగా చేయవలెను.
A. ఫెయిల్యూర్ విత్ యాక్షన్ కోడ్ 01 : ఆధార్ కార్డ్ నెంబరు
సరిగా ఎంటర్ చేసి మరియు పరికరంలో సెలెక్ట్ చేసిన విధంగానే (అంటే ఉదాహరణకు, RT సెలెక్ట్ చేసిన చో కుడి
చేతి బొటను వేలును పెట్టాలి, LI సెలెక్ట్ చేస్తే ఎడమ చేతి చూపుడు వేలును పెట్టాలి అన్న మాట)
ఫింగర్స్ పెట్టినప్పటికి, పై ఎర్రర్ వచ్చినచో, ఆ లబ్ధిదారుడు, ఆధార్
ఎన్రోల్ల్మెంట్ సెంటర్ కి వెళ్ళి, వారి యొక్క వేలి ముద్రాలను, అప్డేట్ ప్రాసెస్
ద్వారా వేలి ముద్రలను అప్డేట్ చేయించుకోవలెను.
B. ఫెయిల్యూర్ విత్ యాక్షన్ కోడ్ 02 : ఆధార్ కార్డ్ నెంబరు
సరిగా ఎంటర్ చేసి మరియు, పరికరంలో సెలెక్ట్ విధంగానే ఫింగర్స్ పెట్టినప్పటికి, పై ఎర్రర్
వచ్చినచో, ఆ లబ్ధిదారుని, ఫింగర్ ప్రింట్ క్వాలిటి చాలా
తక్కువ స్తాయిలో ఉన్నట్లు మరియు, లబ్ధిదారుడు, కొన్ని
సందర్బల్లో మాత్రమే, ఆధార్ పేమెంట్ తీసుకొనుటకు వీలుపడును.
C. ఫెయిల్యూర్ విత్ యాక్షన్ కోడ్ 04: లబ్ధిదారుని, వేలిముద్రలు
ఆధార్ సెర్వర్ నందు లేనట్లు, కావున, లబ్ధిదారుడు మరియొక్కసారి, ఆధార్
ఎన్రోల్మెంట్ సెంటర్ కి వెళ్ళి, తన ఎన్రోల్ చేసుకొనవలెను.
--oo00OO--
No comments:
Post a Comment