A BLOG FOR THE STAFF OF TIRUPATI POSTAL DIVISION AND BY THE STAFF OF TIRUPATI POSTAL DIVISION OF KURNOOL REGION IN AP CIRCLE
NOTE:
Wednesday, 30 July 2014
Monday, 28 July 2014
DEPARTMENT OF POSTS : INDIA.
Office of the Supdt.of Post Offices, Tirupati Dn, Tirupati – 517501.
To
All SDHs/PMs/SPMs in Tirupati Division.
No.Stock/C&G/2014 dated at Tirupati – 517501, the 28.07.2014.
Sub: National Cleaning Drive – Reg.
-o0o-
ప్రధాన మంత్రి నేషనల్ క్లీనింగ్ డ్రైవ్ లో భాగంగా తిరుపతి డివిజన్ లోని ప్రతి ఇన్స్పెక్టర్ / పోస్ట్ మాస్టర్/ సబ్ పోస్ట్ మాస్టర్ మరియు పోస్టల్ అసిస్టెంట్స్ వారి వారి ఆఫీసులను శుభ్రపరచుకోవడంలో చూపిస్తున్న శ్రద్ధ, ఆసక్తి అభినందనీయం. అయితే గతవారం నేను చాలా ఆఫీసులు తిరిగిన తరువాత గమనించిన విషయం ఏమిటంటే ఇంకా చాలా మంది పోస్ట్ మాస్టర్లకు నేషనల్ క్లీనింగ్ డ్రైవ్ యొక్క ప్రాముఖ్యత ఆశించిన రీతిలో అవగాహనకు రాలేదని తెలిసినది. అందువల్ల వారు కేవలం నేలను శుభ్రం చేయడం, బాత్రూమ్స్ కడిగించడమే క్లీనింగ్ డ్రైవ్ గా భావిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రతి పోస్ట్ ఆఫీసు లో ఈ క్రింది తెలుప బడిన పనులు వేగవంతంగా జరగాలి. అవి
1. పోస్ట్ ఆఫీసు లోపల, బయట శుభ్ర పరచాలి.
2. పోస్టి ఆఫీసు పరిసరాల లోనే ఫాన్స్, లైట్స్, బీరువాలు పై భాగాలు, అటకలు, కిటికీ అద్దాలు వంటి అన్ని ప్రదేశాలు శుభ్రంగా మరకలు లేకుండా తుడిపించాలి.
3. UPS లు, Inverter ల బాటరీ ల పైన ఉండే దుమ్మును తొలగించాలి.
4. టేబుల్స్ క్రింది భాగంలో కూడా బూజు పేర్కొని ఉండటం నేను గమనించాను. దానిని కూడా తొలగించాలి.
5. ముఖ్యమైన forms ను, form racks లోనే ఉంచాలి.
6. బీరువాలలో, కాష్ చెస్ట్ లలో కేవలం విలువైన వస్తువులు మరియు రికార్డులను మాత్రమే పదిలపరచాలి.
7. పాతకాలపు పోస్టల్ volumes ఆఫీసుల నుంచి తొలగించాలి.
8. డిపార్టుమెంటు వాల్యుముల కొరకు www.indiapost.gov.in లో ఉండే వాల్యుములను వాడుకోవాలి.
9. కేవలం అవసరమైన టేబుల్స్, చైర్స్, బల్లలు, మాత్రమే ఆఫీసు లో ఉండాలి. అవసరం లేని ఫర్నిచర్ ను అవసరమైన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లకు వారి దగ్గర నుండి వ్రాత పూర్వకముగా తీసుకొని వారికి బదిలీ చేయవలెను.
10. పాత రికార్డు ను వేరు చేసి దానిని సంబంధిత హెడ్ పోస్ట్ ఆఫీసు కు పంపించాలి. పాత రికార్డు ను వేరు చేయునప్పుడు తప్పని సరిగా error బుక్ లో నమోదు చెయవలెను. మరియు preservation period ను తప్పని సరిగా అనుసరించాలి. ఈ preservation periods No. L/Misc/Dlgs dated 23.07.14 లెటర్ ద్వారా మీకు తెలియ చేయడం జరిగింది. మరియు www.sptirupatidop.blogspot.in లో కూడా పెట్టడం జరిగినది. గమనించుకొనగలరు.
11. ఆఫీసు ముందు బాగంలో ఉండే లెటర్ బాక్స్ లను, ఆఫీసు నేమ్ బోర్డులను, ఆఫీసు లోపల ఉండే ప్రకటన బోర్డు లను, నోటీసు బోర్డులను, Citizen charter వంటివి, నీటుగా, చక్కగా, శుభ్రంగా తుడిపించాలి.
12. ఎక్కడ కూడ గోడలకు కాగితములు అతికించడం కాని, ప్రకటనలు అతికించడం కాని చేయరాదు.
13. ఆఫీసు లో పోస్టల్ డిపార్టుమెంటు కు సంబంధించని క్యాలెండర్ లను తీసి వేయాలి.
14. ఎక్కువ ఆఫీసు లలో దేవుడి క్యాలెండర్ లను, ఫోటో లను, చాల ఎక్కువగా ఉంచడం గమనించాను. వీటన్నిటిని తొలగించాలి.
15. టాయిలెట్ లను, బాత్రూమ్ లను శుబ్రముగా క్లీన్ చెయించాలి.
16. బీరువాలలో, rack లలో ఉంచేటు వంటి రికార్డులను, forms ను, చక్కగా ఒక క్రమ పద్దతిలో చూడటానికి కంటికి ఇంపుగా అమర్చాలి.
17. అలమరాలలో, బీరువాలలో, rack లలో నీట్ గా ఉండే కొత్త న్యూస్ పేపర్ ను వేసి దాని పైన రికార్డు లను ఉంచుకోవాలి.
18. ఆఫీసు లలో ఉండే విరిగిపోయిన కుర్చీలను, బల్లలను పాత ఇనుప తూకములను, విరిగిన వస్తువులను మరియు పాత రికార్డు లను మీ మీ సంబంధిత సబ్ డివిజనల్ ఆఫీసు లకు లేదా హెడ్ పోస్ట్ ఆఫీసు లకు పంపించాలి.
19. టెలిఫోన్ తీగలు మరియు విద్యుతు తీగలు చాలా ఆఫీసు లలో వ్రేలాడుతూ ఉన్నాయి. వాటినన్నింటిని నీటుగా క్రమ పద్దతిలో అమర్చు కొనవలెను.
20. పోస్ట్ ఆఫీసు లలో ఉండే drainage సిస్టం లను పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకొనవలెను.
21. ఈ visit లలో భాగంగా ఈ క్రింద తెలుపబడిన items and places యొక్క ఫోటో గ్రాఫ్స్ ను డ్రైవ్ కు ముందు మరియు డ్రైవ్ తరువాత కూడా తీసి పంపగలరు. ఫోటోల సాఫ్ట్ కాపీ నా మెయిల్ కు పంపిన చాలును. నా మెయిల్ అడ్రస్ www.sptirupati.dop@gmail.com. డ్రైవ్ కు ముందు డ్రైవ్ తరువాత తియ్యవలసిన ఫోటోలు.
అ. నేమ్ బోర్డు
ఆ. లెటర్ బాక్స్
ఇ. స్టాండీ
ఈ. పబ్లిక్ హాల్
ఉ. కౌంటర్ లు
ఊ. ఆలమరాలు (తెరిచి ఉంచిన స్థితిలో)
ఋ. టేబుల్స్
ౠ. Forms room
ఎ. స్టాక్ రూమ్
ఏ. ముందు భాగం
ఐ. వెనుక భాగం
ఒ. టాయిలెట్స్
ఓ. సిటిజన్ చార్టర్ బోర్డు
ఔ. నోటీసు బోర్డు
అం. నోటీసు అఫ్ హవర్స్ అఫ్ బిజినెస్ బోర్డు
అః శుభ్ర పరచిన ఫాన్స్, ట్యూబ్ లైట్స్ మరియు ట్యూబ్ లైట్ బారల్స్.
క. కిటికీలు మరియు రెక్కలు
ఫోటో తీయునప్పుడు పైన తెలిపిన వాటిలో ఒకటి కంటే ఎక్కువ అంశములు కలిపి ఫోటో తీయగల అవకాశం ఉంటే ఆ విధముగా ఫోటో స్నాప్స్ సంఖ్యను తగ్గించి ఎక్కువ అంశములతో కూడిన ఫోటో (సాఫ్ట్ కాపీని) డివిజనల్ ఆఫీసు కు పంపగలరు.
పైన చెప్పినటు వంటివి కొన్ని విషయములు మాత్రమే. మీకు తెలిసి మీ అనుభవములో ఆఫీసు ఎలా బాగుంటుందో అలా అమర్చుకోండి. ఆఫీసు ప్రాంగణములో ధూమ పానం నిషేధించబడినది. గత వారం నా పర్యటనలో కొన్ని ఆఫీసు లలో కొంత మంది GDS staff ఆఫీసు వెనుక బాగమున ధూమ పానం చేయడం గమనించి మందలించడం జరిగినది. ఖాళీగా ఉన్న పోస్ట్ మాస్టర్ క్వార్టర్స్ లో కూడా ఒక ఆఫీసు లో అనుమతించబడని ఖాళీ బాటిల్ లను గమనించడం జరిగినది. ఆ సంబంధింత పోస్ట్ మాస్టర్ ను మందలించడం జరిగినది. ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోనగలరు. .
సబ్ డివిజనల్ హెడ్ లు visit చేసిన కొన్ని ఆఫీసు లను నేను మరల visit చెయ్యడం జరిగింది. సబ్ డివిజనల్ హెడ్ లు visit చేసిన తరువాత కూడా ఆఫీసు లో డ్రైవ్ ప్రభావం కనిపించడం లేదు. కావున సబ్ డివిజనల్ హెడ్ లు వారి వారి పరిధిలో తగిన చర్యలు వెంటనే తీసుకొనగలరు. ఇంతవరకు క్లీనింగ్ డ్రైవ్ పూర్తి కాని ఆఫీసు లు యొక్క పేర్లు క్రింద పేర్కొనడమైనది. ఇందులో కొన్ని ఆఫీసు లను నేను visit చెయ్యడం జరిగింది. సంబంధిత సబ్ డివిజనల్ హెడ్ లు ఈ ఆఫీసు లు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పూర్తి చెయ్యవలెను.
1. Chandragiri Fort S.O. 6. Kovanur S.O.
2. Chintaparthy S.O. 7. Pallam S.O.
3. Mahal S.O. 8. Vepagunta S.O.
4. Narasingapuram S.O. 9. Vadamalpet S.O.
5. Tarigonda S.O. 10. Vepagunta S.O.
ఈ పరిశుభ్రత కార్యక్రమములో భాగంగా అందంగా, శుభ్రంగా ఉన్న Project arrow and Look & Feel implement చెయ్యని ఆఫీసు లలో మొదటి 3 ఆఫీసు లకు ప్రశంసా పత్రం మరియు జ్ఞాపికను ప్రదానం చెయ్యడం జరుగుతుంది. గమనించగలరు. DG instructions ప్రకారం ప్రతి నెల ఒక ఉత్తమ ఆఫీసు ను ఎంపిక చేసి బహుమతి ప్రదానం చెయ్యడం జరుగుతుంది. కావున స్టాఫ్ అందరు ఈ కార్యక్రమములో పాల్గొని మన డివిజన్ ను ఈ విషయములో ఉన్నత స్థానములో నిలిపేందుకు సహకరిస్తారని మనః పూర్వ కముగా కోరుకుంటున్నాను.
Subscribe to:
Posts (Atom)