NOTE:

నీ విజయానికి అడ్డుకునేది..... నీ లోని ప్రతికూల ఆలోచనలే... కింద పడ్డామని ఆపితే చేసే పనిలో ఎన్నటికి విజయం సాధించలేము. >

Thursday 2 October 2014

పత్రికా ప్రకటన తేది 02.10.2014 - స్వఛ్చ భారత్

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తపాలా శాఖలోని అన్నీ స్థాయిలోని కార్యాలయముల నందు స్వఛ్ఛ భారత్  కార్యక్రమము నిర్వహింపబడినది. ఈనాడు, గాంధీ జయంతి సందర్భంగా తిరుపతి డివిజను నందు అన్నీ తపాలా కార్యాలయముల నందు గాంధీజీకి ఘన నివాళులు అర్పించి అన్నీ స్థాయిలలో పని చేయు తపాలా సిబ్బంది అందరూ స్వఛ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేసారు. తదనంతరం తపాలా ‍సిబ్బంది అందరూ కలసి స్వఛ్చందంగా కార్యాలయము మరియు పరిసరాలను పరిశుభ్రపరచారు. ఈ కార్యక్రమములో మాట్లాడుతూ తపాలా శాఖాధికారి శ్రీ టి. ఎ. వి. శర్మ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి వారంలో రెండు గంటలు మరియు ఒక సంవత్సరంలో వంద గంటలు పరిశుభ్రతకు కేటాయించినట్లైతే పరిశుభ్ర భారత దేశాన్ని సాధించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమము యొక్క ప్రాముఖ్యతను ప్రతి వ్యక్తి మరో వంద మందికి తెలిపి వారిని కూడా స్వఛ్చ భారత్ అభియాన్ నందు భాగస్వాములను చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఉప తపాలా శాఖాధికారి శ్రీ బి. రమా శంకర్ గారు, తపాలా ఇన్స్పెక్టరు శ్రీ కే. ఆరుముగం గారు, తిరుపతి ప్రధాన తపాలా కర్యాలయ పోస్టుమాస్టరు శ్రీ పి. జనార్ధన్ నాయుడు గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Disqus Shortname

Comments system