కేంద్ర ప్రభుత్వం బాలికల కోసం "సుకన్య సమృద్ధి అక్కౌంట్" అనే కొత్త డిపాజిట్ పథకాన్ని అన్ని పోస్ట్ ఆఫీసులలొను మరియు బ్యాంకులలోను 02.12.14
నుండి ప్రవేశ పెట్టింది. ఈ పథకం యొక్క ముఖ్యాంశాలు:-
Ø
10 సం. వయస్సు లోపు బాలికల పేరుతో ఈ అక్కౌంటు ఓపెన్ చేయవచ్చును. బాలికకు చెందిన నాచురల్ లేదా లీగల్ గార్డియన్ ద్వారా ఖాతా ను తెరువవచ్చును.
Ø బాలికకు 10 సం. వయస్సు తరువాత తనే స్వయంగా ఖాతా లో లావాదేవీలు జరుపవచ్చు.
Ø బాలికకు 21 సం. వయస్సు పూర్తి కాబడినచో ఖాతా పరిపక్వత చెందును.
Ø ఖాతా తెరువబడిన తరువాత బాలికకు 14
సం. వయస్సు వరకు ఖాతా లో డిపాజిట్లు చేయవచ్చును.
ఆ తరువాత బాలికకు 21 సం. వయస్సు పూర్తి అయ్యేంతవరకు డిపాజిట్లు అవసరం లేదు.
Ø ప్రారంభ డిపాజిట్ రూ. 1000 / -. తదుపరి డిపాజిట్లు 100 / - రూ
multiples లో ఎంతైనా జమ చేయవచ్చు.
Ø ఒక ఆర్ధిక సంవత్సరంలో కనీస డిపాజిట్ 1000/- రూ.
Ø ఒక ఆర్ధిక సంవత్సరంలో మొత్తం డిపాజిట్ లు కలిపి 1,50,000 / - రూ. మించకూడదు.
Ø జమలు ఒక కంతులో గాని వేరు వేరు కంతులలో గాని చేసుకోవచ్చు.
Ø బాలికకు 18 సం. వయస్సు వచ్చిన తరువాత తన ఉన్నత చదువు కొరకు గాని వివాహమునకు గాని, ఖాతా లో ఉన్న మొత్తంలో సగం సొమ్మును విత్ డ్రా చేసుకొనే అవకాశం కలదు.
Ø ఖాతా మాత్రము బాలికకు 21 సం. నిండిన తరువాతే పరిపక్వత చెందును. ఒక వేళ బాలికకు 18 సం. నిండిన తరువాత మరియు 21 సం. నిండక ముందే వివాహం అయినచో ఖాతా కొనసాగించడానికి వీలు లేదు. మరియు ఖాతా నిలిపి వేయబడును.
Ø పాస్ బుక్ సదుపాయం కలదు.
Ø ఖాతా ఎక్కడికైనా బదిలీ చేసుకొనే అవకాశం కలదు.
Ø
చెక్కు గాని ద్వారా గాని డిపాజిట్ చేసినచో రియలైజేషన్ తేదీనే డిపాజిట్ తేదీగా స్వీకరించబడును.
మరిన్ని వివరాలకు మీ సమీప పోస్ట్ మాస్టర్ ను సంప్రదించగలరు.......
No comments:
Post a Comment