NOTE:

నీ విజయానికి అడ్డుకునేది..... నీ లోని ప్రతికూల ఆలోచనలే... కింద పడ్డామని ఆపితే చేసే పనిలో ఎన్నటికి విజయం సాధించలేము. >

Wednesday, 26 August 2015

పత్రికా ప్రకటన తేదీ: 26.08.2015



తిరుపతి తిరుమల దేవస్థాములవారి  ఆధ్వర్యములో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తపాలా  కార్యాలయాలలో "రూ. 300/- శ్రీఘ్ర దర్శనం " టికెట్ లను జారీచేయు ప్రక్రియలో భాగంగా, 26.08.2015 తేదీన స్థానిక శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయము ఎదురుగా తిరుపతి టౌన్ బ్యాంకు నందు గల  "తిరుపతి తూర్పు తపాలా కార్యాలయము” నందు, టికెట్ లను జారీచేయు కౌంటరు  ప్రారంభించబడినది. ఈ కార్యక్రమాన్ని, తపాలా సూపరింటెండెంట్ , శ్రీ T.A.V. శర్మ గారు లాంఛనముగా ప్రారంభించినారు. మొదటి టికెట్ ని తిరుపతి టౌన్ బ్యాంకు చీఫ్ అకౌంటెంట్, శ్రీ విజయ భాస్కర్ గారికి, పోస్ట్ మాస్టరు , శ్రీమతి T. పద్మజ గారు అందజేశారు. కార్యక్రమములో, తపాలా అసిస్టెంట్ సూపరింటెండెంట్ , శ్రీ. B. రామ శంకర్ గారు, తపాలా సిబ్బంది, శ్రీ శంకర  రెడ్డి, చెంగల్ రాయులు మరియూ తిరుపతి టౌన్ బ్యాంకు సిబ్బంది, M.D. శ్రీ తిరుమల గారు, చీఫ్ మేనేజర్, శ్రీ ధనంజయ రెడ్డి గారు పాల్గొన్నారు. స్వామివారి దర్శనార్థం "రూ. 300/- శ్రీఘ్ర దర్శనం " టికెట్ లను జారీచేయు సదుపాయాన్ని, స్థానిక మరియు స్థానికేతర ప్రజలందరూ సద్వినియోగ పరుచు కోవలసినదిగా మనవి చేయడమైనది



No comments:

Post a Comment

Disqus Shortname

Comments system