NOTE:

నీ విజయానికి అడ్డుకునేది..... నీ లోని ప్రతికూల ఆలోచనలే... కింద పడ్డామని ఆపితే చేసే పనిలో ఎన్నటికి విజయం సాధించలేము. >

Monday 14 September 2015

పత్రికా ప్రకటన తేదీ: 14.09.2015


తిరుపతి తిరుమల దేవస్థాములవారి  ఆధ్వర్యములో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తపాలా  కార్యాలయాలలో "రూ. 300/- శ్రీఘ్ర దర్శనం " టికెట్ లను జారీచేయు ప్రక్రియలో భాగంగా, 14.09.2015  తేదీన స్థానికంగా ఉన్నటువంటి తపాలా కార్యాలయాలైన, 1) కోర్టు ఆవరణనమునందు గల తిరుపతి వెస్ట్ పోస్ట్ ఆఫీసు 2) సంస్కృత పీఠం నందు గల R.S. గార్డెన్స్ పోస్ట్ ఆఫీసు మరియూ 3) S.V. మెడికల్ కళాశాల నందు గల S.V. మెడికల్ కాలేజీ పోస్ట్ ఆఫీసు లలో టికెట్ లను జారీచేయు కౌంటర్లు   ప్రారంభింపబడి నవి. ఈ కార్యక్రమాన్ని, తపాలా సూపరింటెండెంట్ , శ్రీ T.A.V. శర్మ గారు లాంఛనముగా ప్రారంభించినారు.
కోర్టు ఆవరణనమునందు గల తిరుపతి వెస్ట్ పోస్ట్ ఆఫీసు నందు, పోస్ట్ మాస్టరు , శ్రీ. B. ముని రెడ్డి గారు- శ్రీ .I.C.S. రెడ్డి, తిరుపతి బార్ కౌన్సిల్ సహాయ కార్యదర్శి గారికి, S.V. మెడికల్ కళాశాల నందు గల S.V. మెడికల్ కాలేజీ పోస్ట్ ఆఫీసు నందు, S.V. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ , DR. శ్రీ. M.S. శ్రీధర్ గారికి- పోస్ట్ మాస్టరు , శ్రీ. K. ముని కృష్ణయ్య గారు, మరియూ సంస్కృత పీఠం నందు గల R.S. గార్డెన్స్ పోస్ట్ ఆఫీసు నందు, శ్రీమతి. M. జయప్రద గారికి- తపాలా సూపరింటెండెంట్ , శ్రీ T.A.V. శర్మ గారు, "రూ. 300/- శ్రీఘ్ర దర్శనం " మొదటి టికెట్ ని అందజేశారు.
          ఈ సందర్భంగా, S.V. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ , DR. శ్రీ. M.S. శ్రీధర్ గారు, వైస్-ప్రిన్సిపాల్ , DR.B. జనార్ధన్ రాజుగారు, P.R.O- శ్రీ V. కిరణ్ గారు హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమములో, హైదరాబాద్ పోస్టల్ సర్కిల్ ఆఫీసు నుండి వచ్చినటువంటి, K. నరేంద్ర బాబు గారు, C. శ్రీ గణేష్ గారు; తిరుపతి  తపాలా సిబ్బంది, శ్రీ శంకర  రెడ్డి, చెంగల్ రాయులు, G.N. నాయుడు, S.B. స్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వామివారి దర్శనార్థం "రూ. 300/- శ్రీఘ్ర దర్శనం " టికెట్ లను జారీచేయు సదుపాయాన్ని, స్థానిక మరియు స్థానికేతర ప్రజలందరూ సద్వినియోగ పరుచు కోవలసినదిగా మనవి చేయడమైనది.






No comments:

Post a Comment

Disqus Shortname

Comments system