ప్రెస్ నోట్ - 02-12-2014
పోస్ట్ ఆఫీసుల ద్వారా రూ. 300 / - ప్రత్యేక దర్శన టికెట్లు జారీ
పోస్ట్ ఆఫీసుల ద్వారా రూ. 300 / - ప్రత్యేక దర్శన టికెట్లు జారీ
తపాలా శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం వారి (టిటిడి) సహకారంతో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల లోని కొన్ని ఎంపిక కాబడిన పోస్ట్ ఆఫీసులలో Rs.300 / - ప్రత్యేక దర్శన టికెట్లు 01.12.2014 తేదీ నుండి జారీ చేస్తున్న విషయం విదితమే. ఈ పథకానికి ఇంకొంచెం ఊపు అందిస్తూ తి.తి.దే. వారు 03.12.2014 పోస్ట్ ఆఫీసుల ద్వారా Rs..300 / - ప్రత్యేక దర్శన టికెట్లను ఒక రోజు అడ్వాన్సు గా బుక్ చేసుకునే సదుపాయం కల్పించినది. అనగా 03.12.2014 వ తేదీన బుక్ చేసుకునే టికెట్లు 04.12.2014 నుండి 17.12.2014 మధ్య తేదీలల్లో ఎ రోజు కైనా బుక్ చేసుకునే సదుపాయం కలదు. ఇది వరకులా 2 స్లాట్లు కాకుండా, 5 స్లాట్లలో టికెట్లు జారీ చేయబడును. ఉ. 11.00 గం., 12.00 గం., మ .01.00 గం., 02.00 గం. మరియు 03.00 గం స్లాట్లలో ప్రతి స్లాట్ కి 200 చొప్పున టికెట్లు జారీ చేయబడును. ఇదియే కాకుండా, 15.12.2014 నుండి ఉ. 10.00 గం స్లాట్ లో కూడ 200 టికెట్లు అమ్మబడును. అంటే 15.12.14 నుండి పోస్ట్ ఆఫీసుల ద్వారా అమ్మబడే టికెట్ల కోటా 1000 నుంచి 1200 కు పెంచబడును.
తపాల శాఖ అందిస్తున్న ఈ సేవలను వినియోగించు కొనవలసినదిగా తిరుపతి తపాల శాఖ ప్రజలందిరిని కోరడమైనది.
No comments:
Post a Comment