ప్రెస్ నోట్ –
30.11.2014
పోస్ట్ ఆఫీసుల ద్వారా Rs. 300/- ప్రత్యేక దర్శన టికెట్లు జారీ
తిరుమల తిరుపతి దేవస్థానం వారి
(టిటిడి) సహకారంతో తపాలా శాఖ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల లోని గుర్తింపు పొందిన పోస్ట్ ఆఫీసులలో
Rs.300 /- ప్రత్యేక దర్శన టికెట్ల జారీ కి ఒడంబడిక కుదుర్చుకొన్నది. ప్రారంభం దశలో ఈ పథకం పైలట్ ప్రాతిపదికన క్రింద పేర్కొన్న
5 జిల్లాల్లో ని 9
తపాలా కార్యాలయాల్లో 01.12.2014 వ తేదీ నుండి ప్రారంభం కానుంది.
క్రమసంఖ్య
|
జిల్లా
|
కార్యాలయము
|
1.
|
చిత్తూరు
|
మదనపల్లి హెడ్ పోస్టాఫీసు.
మదనపల్లి బజార్ ఎస్.ఓ.
|
2.
|
విజయనగరము
|
పార్వతీపురం హెడ్ పోస్టాఫీసు
|
3.
|
కర్నూలు
|
ఆదోని హెడ్ పోస్టాఫీసు
నంద్యాల హెడ్ పోస్టాఫీసు
|
4.
|
వరంగల్
|
జనగాం హెడ్ పోస్టాఫీసు
నరసంపేట్ ఎస్.ఓ
|
5.
|
కృష్ణా
|
గుడివాడ హెడ్ పోస్టాఫీసు
నూజివీడు హెడ్ పోస్టాఫీసు
|
తపాలా శాఖ మరియు టిటిడి యొక్క ఈ ఫలవంతమైన భాగ్యస్వామ్యం వల్ల ప్రస్తుతం పట్టణాల్లో మరియు జిల్లా కేంద్ర ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న టిటిడి eDarshan కౌంటర్లలో అమ్మబడుచున్న ప్రత్యేక దర్శన టికెట్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో భక్తులకు కూడ అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక దర్శన టికెట్లు 2 స్లాట్ లలో జారీ చేయబడుతాయి. ఉదయం
10.00 గం. స్లాట్ మరియు మధ్యాహ్నం 03.00 గం. స్లాట్.
ఉదయం 10.00 గం. స్లాట్ కి టికెట్ తీసుకున్నవారు ఉ. 10.00 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. వారికి దర్శన సమయం ఉ. 11.00 గంటలకు.
మధ్యాహ్నం
03.00 గం. స్లాట్ కి టికెట్ తీసుకున్నవారు మ. 03.00 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. వారికి దర్శన సమయం మ. 4.00 గంటలకు. ప్రతి స్లాట్ కు పైలట్ ప్రాజెక్ట్ లో రోజుకు 500 టికెట్లు జారీ చేయబడుతాయి. అనగా రోజుకు 1000 టికెట్లు జారీ చేయబడును. ఏదైన ఒక రోజు టికెట్లు తక్కువగా జారి కాబడినచో ఆ మిగిలిన టికెట్లు ప్రక్క రోజు అదనంగా జారీ చేయబడును. టికెట్లు 15 రోజులు అడ్వాన్సు గా జారీ చేయబడును. అనగా 15వ తేదిన దర్శనానికి 1వ తేదిన, 16వ తేదీకి 2వ తేదీన ….. ఈ విధంగా టికెట్లు జారీ చేయబడును.
తపాల శాఖ అందిస్తున్న ఈ సేవలను వినియోగించు కొనవలసినదిగా తిరుపతి తపాల శాఖ ప్రజలందిరిని కోరడమైనది.
No comments:
Post a Comment