ప్రెస్ నోట్ తేదీ: 15.11.2015
హెడ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సార్వభౌమ బంగారు బాండ్లు
- ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సార్వభౌమ బంగారు బాండ్లు తిరుపతి, శ్రీకాళహస్తిలోని మరియు చంద్రగిరి head post office వద్ద అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యం 20.11.2015 వరకు మాత్రమే అందుబాటులో ఉంది.
- ఆర్బిఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది.
- పోస్ట్ ఆఫీస్ లు ఈ బాండ్లు 20.11.2015 వరకు అమ్మగా.... రిజర్వు బ్యాంకు బండ్లను 26.11.2015 న జారీ చేస్తుంది.
- ఇన్వెస్టర్ కనీసం 2 గ్రాముల బంగారం కొనవలసి ఉంటుంది. అతను ఆర్థిక సంవత్సరంలో 500 గ్రాముల మేరకు బంగారం బాండ్ కొనుగోలు చేయవచ్చు.
- బ్యాండ్ యొక్క ఇష్యూ ధర ఒక గ్రాముకు రూపాయలు2684.00 మాత్రమే. మినిమం రెండు గ్రాములతో బ్యాండ్ ను కొనుగోలు చేయవలసి ఉంటుంది.
- ఈ బాండ్లు గ్రాముల యొక్క గుణిజాలుగా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.
- బాండ్ యొక్క పరిపక్వత కాలం 8 సంవత్సరాలు. కానీ, 5 వ, 6 వ లేదా 7 వ సంవత్సరం తర్వాత నిష్క్రమించడానికి కొనుగోలుదారుకు అవకాశం ఉంది.
- 8,7,6 లేదా 5 సంవత్సరాల తరువాత పరిణితి విలువను ఆ రోజు వున్న బంగారు ధరను బట్టి రిజర్వు బ్యాంకు తెలియ చేస్తుంది. దీనికి అదనంగా ప్రతి 6 నెలలకు ఒక మారు కొనుగోలు విలువ పై @2.75% సింపుల్ ఇంటరెస్ట్ ను ఖాతాదారుని సేవింగ్స్ బ్యాంకు ఎకౌంటు కు జత చేయడం జరుగుతుంది.
- ఈ బాండ్లను పోస్టాఫీసుల ద్వారా నేరుగా లేదా అధీకృత NSC ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. NSC ఏజెంట్లు అమ్మకానికి తగిన కమిషన్ పొందుతారు.
- కొనుగోలుదారుడు తాను, బాండ్లు కొనుగోలు సమయంలో, నిర్ధారించిన అప్లికేషను తో పాటు " నో యువర్ కస్టమర్ డాక్యుమెంట్స్" ను ఇవ్వ వలసి వుంటుంది.
- ఈ బాండ్లను వినియోగదారుడు తాను మిగిలిన సంస్థల్లో లోన్ తీసుకొనుటకు సెక్యూరిటీ గా వినియోగించు కోన వచ్చు.
- మరిన్ని వివరాలకు మీ దగ్గరలోని ప్రధాన తపాలా కార్యాలయాన్ని సంప్రదించ వచ్చు.
- ఈ అవకాశం 20.11.2015 వరకు మాత్రమే....
[ T.A.V.SARMA]
Supdt. of Post Offices,
Tirupati Division,
Tirupati - 517 501.
No comments:
Post a Comment