NOTE:

నీ విజయానికి అడ్డుకునేది..... నీ లోని ప్రతికూల ఆలోచనలే... కింద పడ్డామని ఆపితే చేసే పనిలో ఎన్నటికి విజయం సాధించలేము. >

Monday 28 December 2015

మార్పు 


ఒక మాట -     మంత్రమై  చైతన్యం సృష్టిస్తుంది ....
ఒక  భావం  -  కలలకు నెలవవుతుంది....

ఒక చిరునవ్వుస్నేహానికి నాంది అవుతుంది  ...
ఒక నక్షత్రం -    సంద్రం లో చుక్కానిఅవుతుంది..

ఒక కిరణంతిమిరానికి అంతం అవుతుంది .....
ఒక చేయూత - జీవనాధారం అవుతుంది .....

ఒక అడుగుపయనానికి పునాది అవుతుంది ....
ఒక పలుకు - ప్రార్ధన అవుతుంది ...

ఒక ఆశ - సాధనా స్ఫూర్తి అవుతుంది .....
ఒక స్పర్శ - సంరక్షణా కవచం అవుతుంది ....

ఒక జీవితం - మార్పుకు దోహదమవుతుంది....
ఆ  మార్పు -  మనతోనే ఆరంభమౌతుంది ....

No comments:

Post a Comment

Disqus Shortname

Comments system