NOTE:

నీ విజయానికి అడ్డుకునేది..... నీ లోని ప్రతికూల ఆలోచనలే... కింద పడ్డామని ఆపితే చేసే పనిలో ఎన్నటికి విజయం సాధించలేము. >

Monday, 4 August 2014

A LETTER TO STAFF OF TIRUPATI DIVISION ON BD PRODUCTS


DEPARTMENT OF POSTS  INDIA
Office of the Supdt.of Post Offices, Tirupati Division, Tirupati – 517 501.
ఇష్టపడుతూ కష్టపడుదాం                             లక్ష్యాన్ని సాదిద్దాం
ప్రియమైన సోదర, సోదరి మణులారా,
                   గత 2013-14 సం'' BD టార్గెట్ 425 లక్షలకు గాను 525 లక్షలు మన డివిజన్ సాధించినందుకు చాల సంతోషముగా ఉన్నదిఇది మన పోస్టల్ కుటుంబములో ఉన్న ప్రతి ఒక్క సిబ్బంది   సేవలు అందించడం వల్లనే లక్ష్యాన్ని సునాయాసముగా చేరుకోకలిగాము. ముఖ్యముగా ECIL ప్రాజెక్ట్ ద్వారా మనము 300 లక్షలు స్పీడ్ పోస్ట్  బిజినెస్స్ అనుకొన్న దానికన్నా ఎక్కువుగా     సాధించినాము. ప్రాజెక్ట్ కోసం పనిచేసిన ప్రతి సిబ్బంది యొక్క సర్వీస్ లు  చాల శ్లాఘనీయమైనవి  మరియు మరిచిపోలేనివి
                                 మన పోస్ట్ మాస్టర్ జనరల్ కర్నూల్ వారు 2014-15 సంవత్సరమునకు గాను 510 లక్షల బిజినెస్ లక్ష్యాన్ని మన ముందు ఉంచారుఇది మనకు ఎక్కువ అయినప్పటికీ మనం తప్పకుండా లక్ష్యాన్ని సాధించవలెను యొక్క లక్ష్యాన్ని  క్రింద తెలిపిన బిజినెస్ ద్వారా  పొందవచ్చును.
1.స్పీడ్ పోస్ట్ :  Target Rs. 85 lakhs.
తపాలా శాఖ సాధారణ పోస్ట్లు తొ పోలిస్తే త్వరగా  బట్వాడా చేయబడే సర్విస్  -  స్పీడ్ పోస్ట్  సర్విస్ఒక భారత దేశంఒక రేటు అన్న విధంగా తపాలా శాఖ స్పీడ్ పోస్ట్ ను ప్రజలకు అందుబాటులోకి  తెచ్చింది. కార్పొరేట్ కోసం మరియు సాధారణ వినియోగదారులకు, స్పీడ్ పోస్ట్ హోం సేకరణ, రుణ సౌకర్యం, ఆన్ లైన్ ట్రాకింగ్, ఖాతా నిర్వహణ సేవలను తపాలా శాఖ  అందిస్తుంది. సాధారణ వినియోగదారులకు  స్పీడ్ పోస్ట్ భారతదేశం లో ఎక్కడైనా సేవలను  అందిస్తుంది. స్పీడ్ పోస్ట్ లెటర్లు నిర్దేశించబడిన సమయంలోపు బట్వాడ చేయనియెడల స్పీడ్ పోస్ట్ రుసుము తిరిగి అందించు హామీ కలిగి ఉన్నది.

స్పీడ్ పోస్ట్ రేట్లు
బరువు
స్థానిక (municipaI పరిధుల్లో)
200 కి.మీ. వరకు.
201- 1000 వరకు కెయంఎస్.
1001- 2000 కు కెయంఎస్.
2000 కి.మీ. పైన.
50 గ్రాముల వరకు
INR 15
INR 35
INR 35
INR 35
INR 35
 51 గ్రాముల 200 గ్రాములకు
INR 25
INR 35
INR 40
INR 60
INR 70
201 గ్రాములకు 500 గ్రాముల
INR 30
INR 50
INR 60
INR 80
INR 90
అదనపు 500 గ్రాముల లేదా భాగంగా వాటి
INR 10
INR 15
INR 30
INR 40
INR 50

2. బిజినెస్ పోస్ట్ :: Target Rs.210 lakhs
మెయిలింగ్ పరిష్కారాలను కోసం చూస్తున్న ఒక కార్పొరేట్ కస్టమర్ గా  ఉంటే, బిజినెస్  పోస్ట్ సేవలు మీ పనిని  సులభం మరియు అనుకూల౦గా  చేస్తుంది.బిజినెస్  పోస్ట్ సాధ్యమైనంత తక్కువ ధర లో  ఉత్తమమైన  డెలివరీ తో, మెయిల్ సేవలను అందిస్తుంది.
ఇది చిన్న వ్యాపారులకు  అలాగే పెద్ద సంస్థలకు అనువైన  సేవ. వినియోగదారులు ముద్రణ సహా, ఇన్సర్ట్, సీలింగ్, మరియు వారి నిర్దిష్ట వ్యాపార అవసరాల అడ్రసింగ్ ప్రొఫెషనల్ మెయిలింగ్ సేవలను  ఒక పరిధి నుండి ఎంచుకోవచ్చు. 
  
Service
Details
Mail Room services
Home collection

Insertion

Sealing

Addressing

Franking

Documentation and special despatch
Special delivery services
Special delivery

Other value additions as per customer’s requirements of the customer
మీడియా పోస్ట్:: Target Rs.5000/-
కార్పొరేట్ సంస్థలు / గవర్నమెంట్ ఆర్గానైజేషన్లు / విధ్యా సంస్థలు, వాళ్ళ సంస్థ గురించి లేక వాళ్ళు ఉత్పత్తి చేయు వస్తువులను ప్రచారం చేయుటకు, ఈ స్కీమును ఉపయోగించుకోవచ్చును.  పోస్ట్కార్డులు, లెటర్ , ఏరోగ్రామ్,  మీద ప్రకటనలు చేయవచ్చును. ఈ సౌకర్యం ప్రధాన తపాలా కార్యాలయాలలో లభించును.
4.ఈ పోస్ట్:: Target Rs.50,000/-
ప్రింటెడ్ మాటర్ / చేతి వ్రాత /పిక్చర్లను పోస్ట్ ద్వారా ప్రాంతాలతో పని లేకుండ ఇండియా లో ఎక్కడికైనా తపాలా శాఖ ద్వారా బట్వాడా చేయవచ్చును. ఒక్క  పేజ్ సమాచారాన్ని పంపడానికి కేవలం 10 రూపాయలు చెల్లిస్తే చాలు. తపాలా శాఖ మీరు తెచ్చిన సమాచారాన్ని స్కాన్ చేసి కనపరిచిన అడ్రస్ కు   బట్వాడా చేస్తుంది. సౌకర్యం అన్ని ప్రధాన మరియు ఉప తపాలా కార్యాలయములలో లభించును.
5.డైరెక్ట్ పోస్ట్:: TargetRs. 5000/-
విద్య వాణిజ్య ప్రకటనలు / కార్డ్స్/ బ్రౌచెర్స్/పామ్ప్లెట్స్/ ప్రింటర్ కమ్యూనికేషన్ మొదలగు వాటిని ప్రధాన తపాలా శాఖ ద్వారా సంబంధిత ప్రాంతము లోని వారికందరికి పంపడానికి డైరెక్ట్ పోస్ట్ చాలా సౌకర్యవంతముగా ఉంటుంది. తక్కువ ఖర్చులతో కూడినది. ఒక డైరెక్ట్ పోస్ట్ ఆర్టికల్కు 1.50/- చెల్లిస్తే చాలు. వినియోగదారులు చేయవలసిందల్లా బట్వాడా చేయవలసిన ఆర్టికల్స్ సంఖ్య , ప్రాంతము పేరు తగిన రుసుము పోస్ట్ ఆఫీసు లో చెల్లిస్తే చాలు.

6. రిటైల్ పోస్ట్:: Target Rs.201 lakhs
ఇండియా పోస్ట్ మీ వ్యాపార రిటైల్ పోస్ట్ పెరగడానికి సహాయ పడుతుంది. రిటైల్ పోస్ట్ నందు టెలిఫోన్ బిల్లులు కట్టవచ్చునువిద్య సంభందిత అప్లికేషన్ లు అమ్మబడును. అన్ని తపాలా కార్యాలయాలలో సౌకర్యము లభించును.

7. మీ సేవ:-
మీ సేవ సర్వీసులను పోస్ట్ ఆఫీసు ద్వారా పొందవచ్చును. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ & స్టాంప్స్, మునిసిపాలిటీ, పోలీస్ , ఆధర్ సెర్వీసులు, ఆర్టి, సివిల్ సప్లీస్, ఎడ్యుకేషన్, ఎన్పిడిసిఎల్, అగ్రికల్చర్, లేబర్, మైన్స్& జిఒలజీ, ఎలెక్షన్, ict, ఇండస్ట్రియల్ & కామర్స్, సోషల్ వెల్ఫేర్ మొదలగు సెర్వీసులను మీ సమీపము  లోని ప్రధాన తపాలా కార్యాలయములలో పొందవచ్చును.
8. ఆశీర్వచనం:-
ఆశీర్వచనం అనే పథకం తపాలా విభాగం మరియు టి టి డి ద్వారా సంయుక్తంగా  ప్రారంభించబడినది. భక్తులు టి టి డి నిర్వహించు వివిధ పథకాలను లేదా హుండీకి విరాళాలను ఏ పోస్ట్ ఆఫీసు నుండైన మని ఆర్డర్ ద్వారా పంపవచ్చును. మని ఆర్డర్ ద్వారా విరాళాలు పంపిన భక్తులకు టి టి డి ముందుగా ముద్రించిన రశీదు కార్డ్ను , స్వామి వారు మరియు అమ్మ వారు ఉన్న ఫోటో , అక్షింతలు కవరుతో సహ అందిస్తుంది.
విరాళాలు యొక్క విలువతో సంబందం లేకుండా ప్రతి యొక్క భక్తునకు తపాలా శాఖవారి పోస్ట్ మ్యాన్ ద్వారా అందించబడుతుంది. కనిష్ట పంపదగిన విరాళము రూ1/- , గరిస్టము రూ 5000/-
 9. లాజిస్టిక్ పోస్ట్:: Target Rs.90,000/-
          సరుకుల రవాణా కొరకు లాజిస్టిక్ పోస్ట్ సౌకర్యము అతి తక్కువ ఖర్చుతో తపాలా శాఖ ప్రవేశ పెట్టబడినది. ఈ సౌకర్యము ద్వారా ఇంటి వద్ధ నుండి వస్తువులు మరియు బట్వాడా రవాణా చేయబడును. భీమా సౌకర్యము కూడా కలదు. 50 కి గ్రా కు కనీస ధర  నిర్ణయించబడుతుంది. అన్నీ సమయాలలో డెలివేరి పురోగతికి పర్యవేక్షణ అవకాశం అందిస్తుంది. టారిఫ్ బరువు, పరిమాణం మరియు దూరం ఆధారంగా నిర్ణయించబడుతుంది. వినియోగదారుల నిర్దిస్ట అవసరాల ఆధారంగా వస్తువులను రోడ్డు, రైలు మరియు విమాన మార్గాల ద్వారా రవాణా చేయబడును.

10. వరల్డ్ నెట్ ఎక్స్ ప్రెస్స్:-
వినియోగదారులు ఇండియా నుండి విదేశాలకు  పార్సెల్స్ ను అతి వేగంగా పంపుటకు ఇండియా పోస్ట్ వరల్డ్ నెట్ ఎక్స్ప్రెస్స్ ను  ప్రవేశపెట్టింది. ఇన్ధులో ట్రాకింగ్ సౌకర్యం కూడా కలదు. వరల్డ్ నెట్ ఎక్స్ప్రెస్స్ ద్వారా మీరు డాక్యుమెంట్ మరియు నాన్ డాక్యుమెంట్ పార్సెల్స్ ను పంపవచ్చును. మీరు పంపిచే దేశము మరియు జోన్ ఆధారంగా ఛార్జీలు నిర్ణయింపబడతాయి.
 11.తక్షణ మనీ ఆర్డర్ (iMO) :: Target 20 Transactions.
దేశీయంగా తక్షణ డబ్బు బదిలీ సర్వీస్
ఇండియా పోస్ట్ తక్షణ మనీ ఆర్డర్ (iMO)  సౌకర్యవంతంగా, నమ్మకమైన మరియు సరసమైన తక్షణ ఆన్ లైన్ ద్రవ్య మార్పిడి సేవను  అందిస్తుంది. iMO ఇండియాలోని వినియోగదారుడు తక్షణ వెబ్ ఆధారిత ద్రవ్య మార్పిడి సేవ (iMO సెంటర్) ద్వారా ఇతరులకు డబ్బును పంపించవచ్చు ను. మీరు INR 1,000 / నుంచి  50000/- వరకు బదిలీ చేయవచ్చు. అన్నీ ప్రధాన మరియు ఉప తపాలా కార్యాలయములలో ఈ సర్వీసు కలదు. డబ్బు పంపడానికి మరియు అందుకోవడానికి సులభ మార్గం
టారిఫ్
చెల్లింపులకు
మారకంలో కమిషన్
1000-10000
100
10001-30000
110
30001-50000
120
  
12.మొబైల్ మనీ ట్రాన్స్‌ఫర్:-
మొబైల్ డబ్బు బదిలీ సర్వీస్ 
ఇండియా పోస్ట్ మొబైల్ మని ట్రాన్సఫర్ అనే సర్వీసును ప్రవేశ పెట్టింది. పోస్ట్ ఆఫీసు నందు ఉన్న ప్రత్యేక మొబైల్ ను ఉపయోగించి వినియోగదారులు  డబ్బును తక్షణము బదిలీ చేయవచ్చును.
బదిలీ చేయు మొత్తము
కమీషను
1000 నుండి 1500 వరకు
45
1501 నుండి 5000 వరకూ
79
50001 నుండి 10000 వరకు
112

డబ్బు తీసుకొను వారు పోస్ట్ ఆఫీసుకి వచ్చి సీక్రెట్ పిన్ ఆధారం గా , తమ  గుర్తింపు కార్డ్ ను చూపించి డబ్బు తక్షణమే తీసుకొన వచ్చును.

13.అంతర్జాతీయ ద్రవ్య మార్పిడి(IMTS) :: Target 8919 Transactions.

Money Gram::Target 145Transactions.

                   డబ్బు బదిలీ సర్వీస్ పథకం భారతదేశం ప్రయోజనాలకు విదేశాల నుంచి వ్యక్తిగత సొమ్ము బదిలీ యొక్క శీఘ్ర మరియు సులభమైన మార్గం. కేవలం కుటుంబం నిర్వహణ మరియు భారతదేశం సందర్శించడానికి వచ్చిన   విదేశీ పర్యాటకులు  భారతదేశం లోకి వ్యక్తిగత సొమ్ము అనుమతించబడతాయి. వెస్ట్రన్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (గల్ఫ్ దేశాల నుండి)   మరియు Money Gram (యురోపియన్ దేశాల నుండి)  అంతర్జాతీయఆధునిక అంతర్జాతీయ ద్రవ్య మార్పిడి సర్వీ..స్ ద్వారా డబ్బు తక్షణ చెల్లింపులకు అనుమతిస్తుంది, ఇది భారతదేశం లో పోస్ట్ ఆఫీస్లలో లభ్యమవుతోంది. 195 దేశాల నుండి భారత దేశానికి డబ్బు పంపవచ్చు.

                    మరొక్కసారి మీరు మీ సేవల ద్వారా  మన మాతృసంస్థ  తపాలా శాఖను ముఖ్యముగా మన యొక్క తిరుపతి పోస్టల్ డివిజన్ పేరును ముందుకు తీసుకొని పోవలెనని కోరుచున్నాను..

                                                                                                                           ఇట్లు
 మీ 
                                                                                                                                                           Supdt. Of Post Offices,
                                                                                                                   Tirupati – 517501.

TO,

1.The Postmasters/ SPMs/ All the sub-Divnl. Heads /
PRI(P)s/ MEs in the Division.

2. The Postmaster – General , Kurnool – 518002 for f/o information  please.        

  
                                                                                                                                Supdt. Of Post Offices,
                                                                                                                   Tirupati – 517501.



No comments:

Post a Comment

Disqus Shortname

Comments system