పత్రికా ప్రకటన తేదీ....03.08.2014.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు, చిత్తూర్, అనంతపూర్, కర్నూల్ డిస్ట్రిక్ట్స్ లోని పోస్టల్ మరియు రైల్వే మెయిల్ సర్వీసెస్ డివిజనల్ ఉద్యోగులు ఇంటర్ రీజియన్ క్రికెట్ పోటీలలో పాల్గొన్నారు. నెల్లూరు, చిత్తూర్, అనంతపూర్, కర్నూల్ డిస్ట్రిక్ట్స్ లోని పోస్టల్ మరియు రైల్వే మెయిల్ సర్వీసెస్ డివిజనల్ ఉద్యోగులు రిక్రియేషన్ క్లబ్ ల ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించరు.
తుది విడత పోటీలు ఈరోజు అనగా 03.08.2014 న , తిరుపతి లోని ఏజీ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ జట్లలో, నెల్లూరు మరియు అనంతపురం పోస్టల్ డివిజన్ ల జట్లు ఫైనల్స్ కు చేరుకొన్నాయి.
చివరగా, నెల్లూరు పోస్టల్ డివిజన్ జట్టు, అనంతపూర్ పోస్టల్ డివిజన్ జట్టు పై విజయం సాధించి విజేతగా నిలిచింది.
స్థానిక పోస్టల్ సూపరింటెండెంట్ ఐన శ్రీ టీ. ఏ. వి. శర్మ గారు ఏజీ కళాశాల మైదానంలో నిర్వహించిన విజయోత్సవ సభలో విజేతలను సత్కరించారు. ఈ కార్యక్రమములో మాట్లాడుతూ పోస్టల్ సూపరింటెండెంట్, శ్రీ టీ. ఏ. వి. శర్మ గారు నిరంతరము ఉద్యోగ భాద్యతలలో మునిగి పోయే ఉద్యోగులకు ఇట్టి పోటీలు ఆటవిడుపుగా ఉంటాయని, మానసోల్లసానికి మార్గంగా నిలుస్తాయని, అభిప్రయపద్దరు.
ఈ కార్యక్రామానికి స్థానిక అర్.ఎమ్.ఎస్. ఉద్యోగులు ఆతిధ్యం వహించరు.
No comments:
Post a Comment