NOTE:

నీ విజయానికి అడ్డుకునేది..... నీ లోని ప్రతికూల ఆలోచనలే... కింద పడ్డామని ఆపితే చేసే పనిలో ఎన్నటికి విజయం సాధించలేము. >

Friday, 15 August 2014

తిరుపతి పోస్టల్ డివిజన్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ...... పి .ఎల్. ఐ ., ఆర్ . పి .ఎల్. ఐ., నేషనల్ క్లీనింగ్ డ్రైవ్ అవర్ద్స్ ప్జ్రధానోత్సవమ్....


 PRESS NOTE:


          తిరుపతి తపాలా డివిజన్ లో 68వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. తపాలా సూపరింటెండెంట్ శ్రీ టి.ఏ.వి.శర్మ గారు జాతీయ జండాను ఎగురవేసి తపాలా సిబ్బంది అందరికీ  68వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ టి.ఏ.వి.శర్మ గారు మాట్లాడుతూ  భగవంతుని సన్నిధి అయిన తిరుపతి డివిజన్ లో పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నారని చెప్పారు. manమన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని దీనిలో మన వంతు పాత్రగా తపాల శాఖ ద్వారా ప్రజలందరికీ సేవలందించాలని కోరారు. భారత ప్రభుత్వం యొక్క గ్రామీణ తపాలా జీవిత భీమా మరియు తపాలా జీవిత భీమాలను ప్రజలకు మరింత చేరువగా చేర్చి వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా గత ఆర్థిక సంవత్సరంలో తపాలా జీవిత భీమా బిజినస్ అభివృద్ధికి కృషి చేసి మన డివిజన్ ను కర్నూలు రీజియన్ లోనే RPLI లో మొదటి స్థానంలో, PLI లో రెండవ స్థానంలో నిలిపిన మన తిరుపతి డివిజన్ తపాలా శాఖ సిబ్బందికి తన అభినందనలు తెలియజేశారు. ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా PLI,RPLI బిజినస్ ప్రీమియం Targets సాధించి మొదటి మూడు స్థానాలలో నిలిచినటువంటి సిబ్బందికి బహుమతులు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. తపాలా జీవిత భీమా బిజినస్ లో 2.5లక్షల ప్రీమియంను వసూలు చేసి శ్రీ వి.శంకరయ్య, పోస్టుమాస్టర్ పీలేరు తిరుపతి డివిజన్ లోనే మొదటి స్థానంలో నిలిచారు. అదే విధంగా గ్రామీణ తపాల జీవిత భీమా బిజినస్ లో 2.7 లక్షలు ప్రీమియంగా వసూలు చేసి శ్రీ ఎన్.రెడ్డిభాషా, తపాలా ఇన్స్పెక్టర్ , పీలేరు సబ్ డివిజన్ తిరుపతి డివిజన్ లోనే మొదటి స్థానంలో నిలిచారు. బ్రాంచి పోస్టుమాస్టర్ ల విభాగంలో శ్రీమతి పి.లావణ్య BPM, తాటిమాకులపల్లె a/w భాకరాపేట S.O 1.75 లక్షల ప్రీమియం వసూలు చేసి ప్రథమ స్థానంలో నిలిచారు. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా అందరు బాగా పని చేసి తిరుపతి డివిజన్ ను సర్కిల్ లోనే మొదటి స్థానంలో నిలుపుతారని ఆశించారు.
       ప్రధాన మంత్రి నేషనల్ క్లీనింగ్ డ్రయివ్ లో భాగంగా తిరుపతి డివిజన్ లోని అన్ని తపాలా కార్యాలయాలను శుభ్రపరచి అందంగా తయారు చేయడం జరిగింది. ఈ  68వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బెస్ట్ లుక్ అన్డ్ ఫీల్ కార్యాలయాలుగా గుర్తించబడిన ప్రధాన తపాలా కార్యాలయాలయిన చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తీ తపాలా సిబ్బందికి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ సమావేశంలో తిరుపతి డివిజన్ తపాలా శాఖాధికారి శ్రీ టి.ఏ.వి.శర్మ గారు, Rtd. SSPOs Shaik Ameer గారు, తపాలా అధికారులు, సిబ్బంది మరియు NFPE/FNPO/SC/ST యునియన్ నాయకులు పాల్గొని సమావేశంను జయప్రదం చేశారు.


శ్రీ టి.ఏ.వి.శర్మ
తపాలా శాఖాధికారి,
తిరుపతి డివిజన్, తిరుపతి-517501


  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల  ఛాయాచిత్రములు  ..... 





















నేషనల్  క్లీనింగ్ డ్రైవ్  అవర్ద్స్ ...... 











No comments:

Post a Comment

Disqus Shortname

Comments system