పత్రిక ప్రకటన / 03.06.2014
తిరుపతి పోస్టల్ డివిజన్ లోని తిరుపతి, తిరుమల తపాలా కార్యాలయాలకు సంబంధించిన పోస్టల్ బ్యాంకింగ్ సేవల online విధానము 06.06.2014 వ తేది శుక్రవారం రోజున ప్రారంభింప బడును. ఈ సందర్భముగా న్యూ ఢిల్లీ, హైదరాబాద్, కర్నూల్ నుండి తపాలా శాఖ అధికారులు, ప్రముఖులు ఈ ప్రారంభోత్సవమునకు హజరగుచున్నారు. ఈ అనుసంధాన ప్రక్రియ ప్రారంభ సందర్భముగా జూన్ 5, 6 వ తేదిలలో తిరుపతి, తిరుమల పోస్ట్ ఆఫీసులలో అన్ని రకాల సేవింగ్స్ బ్యాంకు సేవలను తాత్కాలికముగా నిలిపి వెయబడును. ఒక్క సేవింగ్స్ బ్యాంకు మినహా అన్ని తపాల సేవలు యధాతధముగా జరుగును. జూన్ 7 వ తేది శనివారము అయినందున ఉదయం స్వల్ప సంఖ్యలో ప్రయోగాత్మకంగా సేవింగ్స్ బ్యాంకు లావాదేవీలను అనుమతించబడును. జూన్ 9 వ తేది నుండి పూర్తి స్తాయిలో online విధానము ద్వారా సేవింగ్స్ బ్యాంకు లావాదేవీలను అనుమతించబడును. ఖాతా దారులు, పెట్టుబడి దారులు ఈ విషయమును గమనించి సహకరించవలెనని కొరడమైనది.
No comments:
Post a Comment