NOTE:

నీ విజయానికి అడ్డుకునేది..... నీ లోని ప్రతికూల ఆలోచనలే... కింద పడ్డామని ఆపితే చేసే పనిలో ఎన్నటికి విజయం సాధించలేము. >

Monday, 30 June 2014

ప్రెస్ నోట్ తేది 30-06-2014

ప్రెస్ నోట్ తేది 30-06-2014
తిరుపతి డివిజన్ తపాలా శాఖ వారి పరిధి లోని  ఈ క్రింద తెలిపిన బ్రాంచి పోస్ట్  ఆఫీసుల లో బ్రాంచి పోస్ట్ మాస్టర్ పోస్ట్ల కు 26-06-2014 తేదీన నోటిఫికేషన్ విడుదలైనది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు Sri. T.A.V. Sarma , Superintendent  of Post Offices, Tirupati Division చిరునామా కు                28-07-2014 తేది లోపల చేరునట్లు స్పీడ్ పోస్ట్ ద్వార కానీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వార కానీ పంపవలెను. ఈ క్రింద తెలిపిన తేదిలలో  ఒరిజినల్ సర్టిఫికేట్  లతో (ఒరిజినల్ S.S.C  మార్కుల మెమో, 60 రోజుల కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ (ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి పొందినది )మరియు ఒరిజినల్ కుల ధృవీకరణ పత్రములు) తిరుపతి  డివిజన్ ఆఫీసు , తిరుపతి లో  వెరిఫికేషన్ కొరకు హాజరు కావలెను.

బ్రాంచ్ పోస్ట్ ఆఫీసు
ఒరిజినల్ సర్టిఫికేట్ ల పరిశీలన తేది
సమయము
POST reserved for
పోతుకనుమ B.O a/w పాకాల S.O
12-08-2014
ఉదయం 10-00 గంటలకు
Unreserved
అరణ్యం కండ్రిగ B.O a/w నారాయణవరం S.O
12-08-2014
మధ్యాహ్నం     02-00
గంటలకు
SC
మేళ్లచెరువు   B.O a/w పీలేర్ S.O
13-08-2014
ఉదయం 10-00 గంటలకు
Unreserved
కొత్తపాలెం B.O a/w రేణిగుంట S.O
13-08-2014
మధ్యాహ్నం     02-00
గంటలకు
OBC

దరఖాస్తు నమూనాలు పైన తెలిపిన పోస్ట్  ఆఫీసు లో కానీ , తిరుపతి డివిజన్ ఆఫీసు లో కానీ  పొందవచ్చును. దరఖాస్తులు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వార మాత్రమే ఆఖరి తేది (28-07-2014) లోగ  పంపవలెను. ఆర్డినరీ పోస్టు, కొరియర్ పోస్ట్ లేదా ఇతర మాధ్యమము లలో వచ్చు దరఖాస్తులు స్వీకరింపబడవు . ఆఖరి తేది (28.07.2014) తరవాత వచ్చిన దరఖాస్తులు స్వీకరింప బడవు. దరఖాస్తు నమూనాలు నోటిఫికేషన్ మరియు ఇతర వివరాలు “www.sptirupatidop.blogspot.com” అను వెబ్ సైట్ లో చూడవచ్చును. మీరు దరఖాస్తుల తో జతపరిచిన సర్టిఫికేట్ ల ఒరిజినల్ S.S.C  మార్కుల మెమో కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ మరియు ఒరిజినల్ కుల ధృవీకరణ పత్రములు మాత్రమే పరిశీలనకు తేవలెను. దరఖాస్తు కవర్ పైన మీరు ఏ పోస్టు కు దరఖాస్తు చేసుకున్నారో తెలుపవలెను. నోటిఫై చేసిన పోస్టుల వివరాలను  www.sptirupatidop.blogspot.com  అను వెబ్ సైట్ ద్వార పొందవచ్చు.                                          
                                                                                

No comments:

Post a Comment

Disqus Shortname

Comments system