NOTE:

నీ విజయానికి అడ్డుకునేది..... నీ లోని ప్రతికూల ఆలోచనలే... కింద పడ్డామని ఆపితే చేసే పనిలో ఎన్నటికి విజయం సాధించలేము. >

Tuesday, 9 September 2014

ప్రెస్ నోట్ తేది 09-09-2014


తిరుపతి డివిజన్ తపాలా శాఖ వారి పరిధి లోని  ఈ క్రింద తెలిపిన బ్రాంచి పోస్ట్  ఆఫీసుల లో బ్రాంచి పోస్ట్ మాస్టర్ పోస్ట్ల కు 09-09-2014 తేదీన నోటిఫికేషన్ విడుదలైనది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు Sri. T.A.V. Sarma , Superintendent  of Post Offices, Tirupati Division చిరునామా కు  10-10-2014 తేది లోపల చేరునట్లు స్పీడ్ పోస్ట్ ద్వార కానీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వార కానీ పంపవలెను. ఈ క్రింద తెలిపిన తేదిలలో  ఒరిజినల్ సర్టిఫికేట్  లతో (ఒరిజినల్ S.S.C  మార్కుల మెమో, కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ మరియు ఒరిజినల్ కుల ధృవీకరణ పత్రములు) తిరుపతి  డివిజన్ ఆఫీసు , తిరుపతి లో  వెరిఫికేషన్ కొరకు హాజరు కావలెను.
బ్రాంచ్ పోస్ట్ ఆఫీసు
ఒరిజినల్ సర్టిఫికేట్ ల పరిశీలన తేది
సమయము
POST reserved for
చింతగుంట B.O a/w భాకరాపేట  S.O
16-10-2014
ఉదయం 10-00 గంటలకు
Unreserved
మద్దులచెరువుపాలెం B.O  a/w G.K. పల్లె S.O
16-10-2014
మధ్యాహ్నం 02-00 గంటలకు
SC
C.గొల్లపల్లె  B.O a/w పెరుమాళ్లపల్లె S.O
17-10-2014
ఉదయం 10-00 గంటలకు
Unreserved
మన్నవరం B.O a/w పల్లం S.O
17-10-2014
మధ్యాహ్నం 02-00 గంటలకు
OBC
దరఖాస్తు నమూనాలు పైన తెలిపిన పోస్ట్  ఆఫీసు లో కానీ , తిరుపతి డివిజన్ ఆఫీసు లో కానీ  పొందవచ్చును. దరఖాస్తులు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వార మాత్రమే ఆఖరి తేది               (10-10-2014) లోగా  పంపవలెను. ఆర్డినరీ పోస్టు, కొరియర్ పోస్ట్ లేదా ఇతర మధ్యమము లలో వచ్చు దరఖాస్తులు స్వీకరింపబడవు . ఆఖరి తేది (10.10.2014) తరవాత వచ్చిన దరఖాస్తులు స్వీకరింప బడవు. దరఖాస్తు నమూనాలు నోటిఫికేషన్ మరియు ఇతర వివరాలు “sptirupatidop.blogspot.com” అను వెబ్ సైట్ లో చూడవచ్చును. మీరు దరఖాస్తుల తో జతపరిచిన సర్టిఫికేట్ ల ఒరిజినల్ S.S.C  మార్కుల మెమో కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ మరియు ఒరిజినల్ కుల ధృవీకరణ పత్రములు మాత్రమే పరిశీలనకు తేవలెను. దరఖాస్తు కవర్ పైన మీరు ఏ పోస్టు కు దరఖాస్తు చేసుకున్నారో తెలుపవలెను. నోటిఫై చేసిన పోస్టుల వివరాలను “sptirupatidop.blogspot.com” అను వెబ్ సైట్ ద్వార పొందవచ్చు.                                                                                                                                                         

No comments:

Post a Comment

Disqus Shortname

Comments system